BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 12:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాఘవపురంలో నాలుగు రోజులుగా తాగునీటి సరఫరా బంద్ మంచినీటి కోసం గ్రామస్తుల అవస్థలు..

ఆంధ్రప్రదేశ్ హెల్త్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Nov, 2026 - 12:41 PM
40 వీక్షణలు

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం స్పందించకపోతే ధర్నాకు దిగుతామంటున్న గ్రామస్థులు చింతలపూడి, నవంబర్ 10: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవపురం హరిజనవాడలో గత నాలుగు రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస అవసరాలకు కూడా నీరు అందకపోవడంతో తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మంచినీటి కోసం పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరమైన తాగునీటి సమస్య పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, నాలుగు రోజులుగా సరఫరా పునరుద్ధరణ కాకపోవడంపై గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమస్యను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటిని సైతం అందించలేని పరిస్థితిపై గ్రామస్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే గ్రామస్తులంతా ఏకమై ధర్నా చేపడతామని హెచ్చరిస్తున్నారు.