BREAKING
thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV
Date of Publish : 11 October 2026, 08:19 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎస్పీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
11 Oct, 2026 - 08:19 AM
13 వీక్షణలు

పుంగనూరు: అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌ను మదనపల్లె డీఎస్పీ బి. ప్రసాద్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసులకు సంబంధించిన వివరాలను పరిశీలించి పోలీసుల విధుల నిర్వహణ తీరును సమీక్షించారు.

స్టేషన్‌లో నమోదైన కేసులు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల స్థితిగతులపై ఆరా తీశారు. కేసుల విచారణలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని సిబ్బందికి సూచించారు.

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా విధులు నిర్వహించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను శ్రద్ధగా విని చట్ట పరిధిలో పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, నేరాల నియంత్రణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచుతూ ప్రజల్లో భద్రతపై నమ్మకం కలిగించేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ తనిఖీలో పుంగనూరు సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ కె.వి. రమణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.