BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం
Date of Publish : 29 September 2026, 02:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ జడ్పీహెచ్‌ఎస్‌లో విద్యా కమిటీ ఎన్నికలు.. చైర్మన్‌గా బొద్దుకోల నరేంద్ర

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Sep, 2026 - 02:52 PM
2 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విద్యా కమిటీ చైర్మన్‌గా బొద్దుకోల నరేంద్ర, వైస్ చైర్మన్‌గా షేక్ సబియా బేగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పాఠశాల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం, పాఠశాలలో మౌలిక వసతుల మెరుగుదల వంటి అంశాల్లో విద్యా కమిటీ కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా పాల్గొన్న వారు తెలిపారు. పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యా కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు చీదిరాల మారీశ్వరరావు, మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, టీడీపీ నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, నూజివీడు నియోజకవర్గ ఆర్గనైజింగ్ సెక్రటరీ మోదుగు లక్ష్మీ విమల కుమారి, నీటి సంఘం అధ్యక్షులు కందుల రమేష్, మొదుగు ముత్తయ్య, తేనేటి కిరణ్ బాబు, కంచు గిరి, దార్ల ధర్మారావు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.