BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 06:02 pm
Posted by : K MAHESH

ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం విద్యార్థుల హాజరుకు కృషి చేయాలి

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
13 Nov, 2026 - 06:02 PM
20 వీక్షణలు

నవంబర్ నెలలో ప్రత్యేక హాజరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం: డీఈఓ, జాయింట్ కలెక్టర్ అనిల్ కుమార్

మహబూబాబాద్, నవంబర్ 13: ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ నెలలో చేపట్టిన విద్యార్థుల 100 శాతం హాజరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి, జాయింట్ కలెక్టర్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. విద్యార్థులందరూ క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

శుక్రవారం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీ సభ్యులు జాయింట్ కలెక్టర్ అనిల్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ, వాటి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

ప్రస్తుతం నవంబర్ నెలలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల 100 శాతం హాజరు లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అన్నారు. విద్యార్థులు పాఠశాలలకు క్రమం తప్పకుండా వచ్చేలా ఉపాధ్యాయులు, సంబంధిత సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థుల హాజరు పెంపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ నెహ్రూ నాయక్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నూతన జిల్లా అధ్యక్షుడు భూక్య రామోజీ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి మహేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు బి. కోటయ్య, సీనియర్ నాయకులు ఎం. వీరస్వామి, డి. బద్రు నాయక్, విజయ్ కుమార్, అశోక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాగంటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.