మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక
మూలపేట: మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తల్లిదండ్రులంతా కలిసి నూతన కమిటీని ఎన్నుకున్నారు.
తల్లిదండ్రుల మద్దతుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు బొడ్డెడ ఆది కుమార్ తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌గా, డేగల అప్పలనర్స వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వీరితో పాటు ఇతర కార్యవర్గ సభ్యులను కూడా తల్లిదండ్రులు ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు కమిటీ సభ్యులను తాజా మాజీ సర్పంచ్ బిశెట్టి గంగ అప్పలనాయుడు శాలువాలతో సత్కరించి అభినందించారు. పాఠశాల అభివృద్ధికి నూతన కమిటీ సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ మాజీ చైర్మన్ కాండ్రేగుల సాంబశివ, విశాఖ డైరీ మాజీ అధ్యక్షులు కాండ్రేగుల నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు ఎల్లపు రాజేశ్వరరావు, మొల్లేటి గోవిందరావు, బిశెట్టి అప్పారావు, సరగడం ఉమా, కాండ్రేగుల శ్రీనివాసరావు, బొడ్డెడ ఆదిరాజు తదితరులు పాల్గొన్నారు.