చార్జింగ్ పెట్టిన కొద్దిసేపటికే ఎలక్ట్రిక్ స్కూటర్ పేలుడు
తెలంగాణ
/
జగిత్యాల
కోరుట్ల, జగిత్యాల జిల్లా: కోరుట్ల పట్టణంలోని సాయిరాంపూర్ కాలనీలో చార్జింగ్‌కు పెట్టిన కొద్దిసేపటికే ఎలక్ట్రిక్ స్కూటర్ పేలిపోయిన ఘటన చోటుచేసుకుంది.
స్కూటర్ నుంచి భారీ శబ్దం రావడంతో యజమాని అప్రమత్తమై పరిశీలించగా మంటలు చెలరేగినట్లు గుర్తించారు. వెంటనే మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో సుమారు రూ.లక్ష విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు, బ్యాటరీ లేదా చార్జింగ్ వ్యవస్థలో ఏదైనా సాంకేతిక లోపం ఉందా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.