BREAKING
thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం thumb ● ఇళ్ల మధ్య సిమెంట్ గోడౌన్‌పై స్థానికుల ఆందోళన.. భారీ వాహనాలతో ఇబ్బందులు thumb ● రామన్నపేటలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు thumb ● రాయలసీమ ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి.. మరో 5 పైలట్ శిక్షణ కేంద్రాలు thumb ● కడప విమానాశ్రయ నూతన టెర్మినల్ పనుల పురోగతిపై సమీక్ష thumb ● వెల్లంకిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి.. పోరాట స్ఫూర్తిని స్మరించిన గ్రామస్థులు thumb ● విజయవాడలో సెప్టెంబర్ 30న పేదలకు పట్టాభిషేకం thumb ● కొండుపాలెంలో ఘనంగా శ్రీ సంపత్ వినాయక యూత్ 30వ వార్షికోత్సవం అన్నప్రసాద కార్యక్రమం thumb ● స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ వ్యూహరచన thumb ● వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని భూమా అఖిలప్రియకు వినతి thumb ● 11వ రోజుకు చేరిన వీఆర్ఏల దీక్షకు చిర్ల జగ్గిరెడ్డి సంఘీభావం
Date of Publish : 26 September 2026, 07:08 pm
Posted by : DAVU RAVINDER REDDY

ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి..యువతికి తీవ్ర గాయాలు

తెలంగాణ
/ మేడ్చల్-మల్కాజిగిరి
26 Sep, 2026 - 07:08 PM
16 వీక్షణలు

ఘట్కేసర్ (N Today News): ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందగా, మరో యువతి తీవ్రంగా గాయపడిన ఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యన్నంపేట వంతెనపై శనివారం చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా తిప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కిషోర్ (20) బి.ఎన్.రెడ్డి నగర్‌లో నివాసం ఉంటూ ఇబ్రహీంపట్నంలోని సెయింట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.

శనివారం తన బంధువు విజయను పరీక్ష రాసేందుకు యన్నంపేటలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలకు మోటార్‌సైకిల్‌పై తీసుకెళ్తుండగా యన్నంపేట వంతెనపై ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కిషోర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా.. విజయ తీవ్రంగా గాయపడింది.

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన విజయను మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడు కిషోర్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

ఈ ఘటనపై పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.