BREAKING
thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన అమీనాబాద్ TGMS విద్యార్థులు thumb ● పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ల పంపిణీ thumb ● ‘చలో మేడారం’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి: చాగంటి కిషన్ thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాతో పేదలకు ఆర్థిక రక్షణ: ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ thumb ● కేసముద్రం మున్సిపాలిటీలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం thumb ● పేద కుటుంబాలకు కొండంత అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా thumb ● అంతర్జాతీయ సదస్సుకు కేసముద్రం విద్యార్థి పట్ల చందు ఎంపిక thumb ● పేదలకు భరోసా.. ఇందిరమ్మ బీమా thumb ● జిల్లా స్థాయి ఎన్నికల అవగాహన పోటీల్లో నెల్లికుదురు మోడల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ thumb ● బయ్యారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా భూక్య ప్రవీణ్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
Test 4
Date of Publish : 20 November 2026, 03:20 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Nov, 2026 - 03:20 PM
27 వీక్షణలు

ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా ఐడియాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో వేడుకలు

తిరువూరు, నవంబర్ 20 (ఎన్ టుడే న్యూస్): బాలల హక్కులపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారి సృజనాత్మకతను ప్రోత్సహించాలనే లక్ష్యంతో తిరువూరులో ప్రపంచ బాలల హక్కుల దినోత్సవ వేడుకలను ఐడియాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపై నిర్వహించిన ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మక ఆలోచనలు, రచనా నైపుణ్యాలు, చిత్రలేఖన ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు నిర్వాహకులు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేసి అభినందించారు.

అనంతరం నిర్వహించిన సభలో కార్యక్రమ నిర్వాహకుడు శౌరి మాట్లాడుతూ.. బాలల హక్కులపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బాలలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం, రక్షణ, సమాన అవకాశాలు కల్పించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు. బాలల హక్కుల దినోత్సవం ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేస్తూ, బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా శక్తి, రచనా నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వెలికితీయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఇలాంటి పోటీలు, కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గీతం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్ యాసిన్, ఉపాధ్యాయులు జి. ప్రసాద్, ఎం. రాజేశ్వరి, డ్రీమ్ ఇండియా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్. బీనకుమార్, ఉపాధ్యాయులు శ్రీరామ్, మహాశివ, మాధవి, ఐడియాస్ సంస్థ సమన్వయకర్త జి. తిరుపతిరావు, దేవరపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.