BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 09:55 pm
Posted by : SEETHA KIRAN KUMAR

బతుకమ్మ, దసరా ఉత్సవాలకు వరంగల్‌లో విస్తృత ఏర్పాట్లు

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
08 Oct, 2026 - 09:55 PM
6 వీక్షణలు

వరంగల్: ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ ఉత్సవాలు, 18, 20 తేదీల్లో నిర్వహించనున్న సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రేటర్ వరంగల్ పరిధిలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.

ఈ సందర్భంగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ. వెంకన్న ఊర్సు గుట్ట, బెస్తం చెరువు, రంగశాయిపేట, మెట్టుదర్వాజా, శివనగర్, కట్టమల్లన్న, కాశిబుగ్గ, చిన్న వడ్డేపల్లి, మెట్లబావి, తోట మైదానం ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో బతుకమ్మ, దసరా ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

ఉత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ దీపాల ఏర్పాటు, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు తదితర ప్రజా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

నిమజ్జన ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ ఉత్సవాలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఉత్సవాల సమయంలో పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. లైటింగ్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను కూడా ముందుగానే పూర్తి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కమిషనర్ పేర్కొన్నారు.