BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 27 September 2026, 04:54 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పంట ఎండిపోవడంతో రైతు ఆత్మహత్య.. రూ.15 లక్షల అప్పులు

తెలంగాణ
/ ఆదిలాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
27 Sep, 2026 - 04:54 PM
9 వీక్షణలు

ఆదిలాబాద్: పంటకు సాగునీరు అందక దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ గ్రామీణ మండలం లాండసాంగ్వి గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన తీగల రమేష్ (47) తనకు ఉన్న 8 ఎకరాల్లో పత్తి, కంది పంటలు సాగు చేసేందుకు సుమారు రూ.15 లక్షల వరకు అప్పు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే పంటకు తగినంత నీరు అందకపోవడంతో పంట దెబ్బతిని ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదని పేర్కొన్నారు.

దీంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రమేష్ తీవ్ర ఆవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. రైతు ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, అప్పుల వివరాలు తదితర అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

సాగునీటి సమస్యలు, పంట నష్టాలు, అప్పుల భారం వంటి కారణాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.