BREAKING
thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి thumb చిత్తూరులో గణనాథుడికి ప్రత్యేక పూజలు thumb క్యాన్సర్ నివారణపై ప్రత్యేక దృష్టి: మంత్రి సత్యకుమార్ యాదవ్ thumb మంగళ వాయిద్యాలు — మన సంస్కృతికి మంగళనాదం thumb వెలుగొండ నిర్వాసితులకు కలెక్టర్ భరోసా thumb మార్కాపురంలో వేడెక్కుతున్న మున్సిపల్ రాజకీయం thumb వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి: బోయినపల్లి వినోద్‌కుమార్ thumb శ్రీ సరస్వతీ శిశు మందిరం భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రముఖులు thumb అల్లిపూర్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఆయుర్వేద దినోత్సవం thumb రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నంబర్ పొందాలి: జిల్లా వ్యవసాయ అధికారి thumb భూమి కొనుగోలు సమయంలో అన్ని రికార్డులను పరిశీలించాలి
Date of Publish : 22 September 2026, 05:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Sep, 2026 - 05:34 PM
26 వీక్షణలు
ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ 

చాట్రాయి: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు వరి సాగులో సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు, పొలం పరిసరాల విశ్లేషణ, సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు. మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం చాట్రాయి గ్రామంలో రైతులకు ఎల్‌నినో ప్రభావం, నీటి నిల్వ జాగ్రత్తలు, పంట యాజమాన్య పద్ధతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
వరి మున తిరిగిన రోజు నుంచి పైరు దుబ్బు చేయడం పూర్తయ్యే వరకు పొలంలో 2 నుంచి 3 సెంటీమీటర్ల మేర పలుచని నీటి పొర ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. పొలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉంటే పైరు దుబ్బు చేయడం తగ్గుతుందని వివరించారు. చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు సుమారు 5 సెంటీమీటర్ల నీరు ఉండేలా నీటి యాజమాన్యం చేపట్టాలని తెలిపారు.
పంటను ఆశించే శత్రు పురుగులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులను రైతులు గుర్తించడంతో పాటు వాటి వివిధ దశలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కందిరీగలు, సాలీడు పురుగులు, అక్షింతల పురుగులు, తూనీగలు, నీటినల్లులు, కోకో కోల పురుగులు తదితరాలు పంటకు మేలు చేసే మిత్ర పురుగులని తెలిపారు. వీటిని సంరక్షించుకోవడం ద్వారా సహజసిద్ధంగా శత్రు పురుగుల నియంత్రణకు అవకాశం ఉంటుందని వివరించారు.
పొలాల్లో పక్షి స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలని రైతులకు సూచించారు. పక్షి స్థావరాల ద్వారా పంటను ఆశించే శత్రు పురుగులను పక్షులు ఆహారంగా తీసుకోవడంతో పురుగు ఉధృతి తగ్గించేందుకు సహజ పద్ధతిలో చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. అవసరం లేకుండా పురుగుమందులు వినియోగించకుండా పంట పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని వర్షపాతంలో మార్పులు సంభవించే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతపై ముందస్తు ప్రణాళిక చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు. వర్షపు నీరు వృథాగా బయటకు వెళ్లకుండా పొలంలో ఇంకేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భూగర్భ జలాల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
పొలం పరిసరాలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ నేలలో తేమ, నీటి నిల్వ, పంట ఎదుగుదల, పురుగుల ఉధృతి వంటి అంశాలను రైతులు గమనించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంట యాజమాన్య పద్ధతుల్లో అవసరమైన మార్పులు చేసుకుంటూ సాగు చేపట్టాలని తెలిపారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవడం, పంటకు అవసరమైన దశలో మాత్రమే తగిన మోతాదులో నీరు అందించడం ద్వారా సాగు ఖర్చులను నియంత్రించడంతో పాటు పంట దిగుబడిని కాపాడుకోవచ్చని వివరించారు.
ఈ సందర్భంగా రైతులు ఎల్‌నినో ప్రభావం, నీటి నిర్వహణ, మిత్ర పురుగుల సంరక్షణ, పక్షి స్థావరాల ఏర్పాటు, సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై అవగాహన పెంచుకుని వాటిని తమ పొలాల్లో అమలు చేయాలని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు.