BREAKING
thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb చిట్యాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Date of Publish : 23 September 2026, 04:56 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పంటల సాగులో రైతులు అప్రమత్తంగా ఉండాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Sep, 2026 - 04:56 PM
19 వీక్షణలు

పంటల సాగులో రైతులు అప్రమత్తంగా ఉండాలి వామకుంట్లలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

తిరువూరు మండలం వామకుంట్ల గ్రామంలో జిల్లా వనరుల కేంద్రం (డీఆర్‌సీ), ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఆర్‌సీ ఏవో కె. పద్మజా రాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు వరి పంటలో పురుగులు, తెగుళ్ల యాజమాన్యంతో పాటు నీటి యాజమాన్యంపై అవగాహన కల్పించారు. వరి పంటలో పురుగులు, తెగుళ్లను తొలిదశలోనే గుర్తించి తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. పంటకు అవసరమైన మేరకే నీటిని వినియోగిస్తూ నీటి యాజమాన్యాన్ని సమర్థవంతంగా చేపట్టాలని రైతులకు వివరించారు.

ఈ సందర్భంగా ఏవో పద్మ మాట్లాడుతూ రైతులందరూ తాము సాగు చేసిన పంటలను తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. పంట నమోదు ప్రక్రియతో పాటు రైతులు ఈ-కేవైసీ కూడా పూర్తి చేసుకోవాలని తెలిపారు. పంటల వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ శాఖ సేవలు పొందేందుకు రైతులకు ప్రయోజనం ఉంటుందని వివరించారు. పంటల సాగులో వ్యవసాయ శాఖ సూచనలు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించే దిశగా రైతులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పంది ముత్యం, ఆర్‌ఎస్‌కే సిబ్బంది, స్థానిక రైతులు పాల్గొన్నారు.