BREAKING
thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం thumb ● మహేశ్వరం మెడికల్ కాలేజీకి సొంత భవనం నిర్మించాలి thumb ● జటబోయిన ఎల్లమ్మ కుటుంబానికి సర్పంచ్ రూ.5 వేల ఆర్థిక సాయం thumb ● ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయాధికారుల బదిలీలు thumb ● కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి -ఎమ్మెల్యే బండారు సత్యానందరావు thumb ● సామాన్య కార్యకర్తకు అవకాశం.. తోటకూర సుబ్బరాజు ప్రచారానికి పార్టీ శ్రేణుల మద్దతు thumb ● పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రభుత్వ ఉద్యోగులు thumb ● ర్యాలి హైస్కూల్లో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం thumb ● ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్‌–టీచర్ సమావేశాలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్ thumb ● రెండు ప్రధాన రహదారులకు జాతీయ హోదా కల్పించాలి: ఎంపీ చామల thumb ● ఆత్రేయపురంలో గెలుపే లక్ష్యంగా శ్రీధర్ విస్తృత ప్రచారం
Test 4
Date of Publish : 04 November 2026, 02:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తుఫాన్ బీభత్సంతో రైతాంగానికి తీవ్ర నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Nov, 2026 - 02:15 PM
9 వీక్షణలు

రైతుల ప్రభుత్వ, ప్రైవేటు రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి  అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ 

రాష్ట్రంలో వరుసగా సంభవిస్తున్న తుఫాన్ల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిందని అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటలు దెబ్బతిని తీవ్ర నష్టం వాటిల్లుతున్నా పాలకులు ఎన్నికల వ్యవహారాల్లో నిమగ్నమయ్యారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కుబడిగా నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటున్నాయని, పంటల బీమా పథకాలు కూడా అమలుకు నోచుకోవడం లేదని ఆరోపించారు. ఒకవైపు పంటలు దెబ్బతిని రైతులు విలవిల్లాడుతుంటే, మరోవైపు బ్లాక్ మార్కెట్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు, బియ్యం ధరలను పెంచి వినియోగదారులను దోచుకుంటున్నారని అన్నారు. కార్పొరేట్ సంస్థలకు ఏటా రూ.16.40 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేస్తున్న ప్రభుత్వాలు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతుల రుణాలను ఒక్కసారైనా పూర్తిగా మాఫీ చేసేందుకు ముందుకు రావడం లేదని విమర్శించారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రైతాంగ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తుఫాన్ల కారణంగా నష్టపోయిన రైతుల ప్రభుత్వ, ప్రైవేటు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎలినో పరిస్థితులు, ఆర్నాబ్ తుఫాన్, ప్రస్తుతం సంభవించిన మురసు తుఫాన్ రాష్ట్ర వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయని హరినాథ్ పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం తుఫాన్ ప్రభావంతో వ్యవసాయ రంగానికి సుమారు 94 శాతం మేర నష్టం వాటిల్లిందని, రూ.343.95 కోట్ల నష్టం సంభవించిందని తెలిపారు. సుమారు 43 వేల హెక్టార్లలో పంటలు నీట మునిగాయని, పశ్చిమగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లోనూ భారీగా పంట నష్టం జరిగిందని వెల్లడించారు. ఇప్పటికీ వరద ముప్పు, బలమైన గాలుల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో నష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర పరిశీలకులు వచ్చి నష్టాలను పరిశీలించేలోపే మరో తుఫాన్ విరుచుకుపడే పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరమన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల వారీగా, సర్వే నంబర్ల వారీగా పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని కోరారు. నష్టపరిహారం కేవలం భూయజమానులకే కాకుండా కౌలు రైతులకు కూడా పూర్తిస్థాయిలో అందించాలని డిమాండ్ చేశారు. పంటలు కోల్పోయిన రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోకుండా ప్రత్యేక ఆర్థిక సహాయ ప్యాకేజీ ప్రకటించాలని డి. హరినాథ్ ప్రభుత్వాలను కోరారు.