BREAKING
thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం thumb ● తొట్టంబేడు ఎంపీటీసీ అభ్యర్థిగా వెడాం కిష్టయ్యకు బీజేపీ బి-ఫారం thumb ● మేచరాజుపల్లి ఉపాధ్యాయుడు శాగంటి స్వామికి జాతీయ స్థాయి పురస్కారం thumb ● చివరి ఆయకట్టు వరకు ఎస్సారెస్పీ జలాలు అందించడమే లక్ష్యం thumb ● పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి thumb ● నార్సింగి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● హత్య, అత్యాచారం కేసులో నిందితుడికి జీవిత ఖైదు thumb ● ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా thumb ● డిండి ప్రాజెక్టుపై డీకే అరుణ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమే: జక్కలి రాజు యాదవ్ thumb ● మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదు thumb ● పట్టభద్రుల ఓటరు నమోదు కేంద్రాన్ని సందర్శించిన వేముల వీరేశం
మంచి మాట
Date of Publish : 26 October 2026, 10:04 pm
Posted by : KOLA MAHESH

రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
Kola Mahesh Munugodu Constituency
26 Oct, 2026 - 10:04 PM
15 వీక్షణలు
  • వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం
  • పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు జరగాలి
  • పాల్గొన్న అధికారులు, నాయకులు

రామన్నపేట | ఎన్ టుడే న్యూస్‌ | అక్టోబర్ 26: రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట వ్యవసాయ మార్కెట్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని వేముల వీరేశం సూచించారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల తహసీల్దార్ లాల్ బహదూర్, ఎంపీడీవో ఆవుల రాములు, ఏపీఎం జానీ, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పున్న జగన్మోహన్, కందిమల్ల గోపాల్ రెడ్డి, మారేపల్లి మల్లారెడ్డి, జినుకల ప్రభాకర్, గుత్తా నర్సిరెడ్డి, వనం చంద్రశేఖర్, సాల్వేర్ అశోక్, రామిని రమేష్, బొడ్డు సాలయ్య, గోదాసు శ్రీమన్నారాయణ, బత్తుల కృష్ణ, జల్ల వెంకటేశం, కొమ్ము శేఖర్, మహమ్మద్ జమీరుద్దీన్, మహమ్మద్ అక్రమ్, పెద్దగోని వెంకటేశం, శంబాల వెంకటేశం, కోట సుధాకర్, ఎర్ర శేఖర్, మోటే రమేష్, నోముల ప్రవీణ్, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.