BREAKING
thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక thumb ● కుట్టు మిషన్లు, సంఘ భవనం మంజూరు చేయాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మేరు సంఘం వినతి thumb ● భక్తులకు ఆలయ కమిటీ కీలక ప్రకటన.. 28, 29 తేదీల్లోనూ పోలు ధారాలు, భాషింగాలు పంపిణీ thumb ● మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తి.. చికిత్స పొందుతూ మృతి thumb ● విద్యార్థుల ప్రతిభకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ వేదిక thumb ● గ్రామపంచాయతీ అవినీతి ఆరోపణల విచారణ నివేదిక ఎప్పుడు? thumb ● విజ్‌డమ్ హైస్కూల్‌లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం thumb ● ఖానాపూర్ మండలంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం.. thumb ● ముదిరాజ్‌లను బీసీ ‘డీ’ నుంచి ‘ఏ’ కేటగిరీలోకి మార్చాలి thumb ● గార్ల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షుడిగా కనకశేఖరం, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఎన్నిక
Test 4
Date of Publish : 22 November 2026, 06:27 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉప్పల్ హెరిటేజ్‌ ఫుడ్స్‌లో ఘోర ప్రమాదం.. డ్రమ్‌ పేలి మహిళ మృతి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Nov, 2026 - 06:27 AM
21 వీక్షణలు

హైదరాబాద్‌: ఉప్పల్‌ పారిశ్రామిక ప్రాంతంలోని ఐడీఏలో ఉన్న హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యర్థాలను పారవేసేందుకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా డ్రమ్‌ పేలడంతో పింకీ దేవి (36) అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పరిశ్రమలో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. పరిశ్రమలో వ్యర్థాలను తొలగించే పనిలో భాగంగా పింకీ దేవి అక్కడికి వెళ్లిన సమయంలో డ్రమ్‌ అకస్మాత్తుగా పేలినట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో జరిగిన ఈ పేలుడులో ఆమె తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ ఘటనతో తోటి కార్మికులు, పరిశ్రమ పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు కంపెనీ ఎదుటకు చేరుకుని ఆందోళన చేపట్టారు. పింకీ దేవి మృతికి సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మృతురాలి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయమైన పరిహారం అందించాలని కోరారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా, ప్రమాదానికి అసలు కారణాలేమిటనే అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించేలా పరిశ్రమ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, అధికారుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.