BREAKING
thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం thumb ● 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం.. రూ.5 లక్షలతో సరికొత్త మోడల్ thumb ● రాజ్యాధికార పాదయాత్రకు విశేష స్పందన thumb ● ప్రకృతి వ్యవసాయంతో భూసారం, పర్యావరణ పరిరక్షణ thumb ● నిర్ణీత గడువులోగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి thumb ● రాములమ్మ మృతి సీపీఐకి తీరని లోటు thumb ● ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ఈడెల్లి బలరాంకు ఘన సన్మానం thumb ● రాష్ట్రవ్యాప్తంగా 86 మోడల్ బస్ స్టేషన్లు thumb ● వచ్చిన నేపథ్యాన్ని మరవొద్దు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం! thumb ● బాలాజీ నాయక్ తండ్రి దశ్రు నాయక్ మృతి బాధాకరం thumb ● తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నూతన మండల అడహాక్ కమిటీ నియామకం
Test 4
Date of Publish : 10 November 2026, 06:16 pm
Posted by : ANTHATI NARENDAR

నల్లగొండ పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు హత్య

తెలంగాణ
/ నల్గొండ / నల్గొండ
Reporter
Anthati Narendar Chityala Town
10 Nov, 2026 - 06:16 PM
12 వీక్షణలు

భర్తే గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలే కారణమా?

నల్లగొండ (ఎన్ టుడే న్యూస్):

నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న మెహబూబ్ బీని ఆమె భర్త సతీష్ గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.

మెహబూబ్ బీ, సతీష్ కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరచూ కుటుంబపరమైన గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటనకు దారితీసిన పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మహిళా హోంగార్డు హత్యకు గురైనట్లు సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి, ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. హత్యకు గల కారణాలు, ఘటన జరిగిన పరిస్థితులపై విచారణ చేపట్టారు.

పోలీస్ క్వార్టర్స్‌లోనే మహిళా హోంగార్డు హత్యకు గురికావడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఈ ఘటనలో భర్త పాత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.