BREAKING
thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● AP వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సాక్షి రిపోర్టర్ ధర్మారెడ్డి thumb ● సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత పలు సంస్థల నివాళులు thumb ● హయత్‌నగర్ లేబర్ అడ్డా సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి thumb ● వావిళ్లపల్లిలో చంద్రయ్య దశదినకర్మ thumb ● రూ.13.50 కోట్లతో నిర్మించిన రోడ్ల నాణ్యతపై చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నలు thumb ● సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్త
Date of Publish : 05 October 2026, 08:32 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో ముత్యాలమ్మ జాతర సందడి..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Oct, 2026 - 08:32 AM
3 వీక్షణలు

 విద్యుత్ వెలుగుల్లో అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణ చింతలపూడి: ముత్యాలమ్మ జాతర మూడో రోజు సందర్భంగా ఆదివారం చింతలపూడి పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు, జాతరను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పట్టణంలోని ప్రధాన వీధులు జనసందోహంతో కిక్కిరిశాయి. వివిధ రకాల వేషధారణలు, డప్పుల మోతలు, సంప్రదాయ కార్యక్రమాలు, రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలు జాతరకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. బెల్లంపేట ముత్యాలమ్మ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. జాతర సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రివేళ విద్యుత్ దీపాల వెలుగుల్లో సాగిన అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల సందడి, డప్పుల శబ్దాలు, వీధులన్నీ అలంకరణలతో కళకళలాడటంతో చింతలపూడి పట్టణమంతా జాతర ఉత్సాహంతో మార్మోగింది. మూడో రోజు వేడుకలు భక్తి, సంప్రదాయం, ఉత్సాహాల సమ్మేళనంగా సాగాయి.