చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల
ఆంధ్రప్రదేశ్
/
చిత్తూరు
చిత్తూరు: చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 60 వార్డులకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్ విడుదల చేశారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తుది ఓటర్ల జాబితాను ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
అలాగే గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు కూడా తుది ఓటర్ల జాబితా ప్రతులను అందజేశారు. ఓటర్లు తమ పేర్లు, ఇతర వివరాలను సంబంధిత జాబితాలో పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏసీపీ నాగేంద్రతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.