అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్
కోరుకొండ : మండలంలోని బూరుగుపూడి గ్రామానికి చెందిన మంగం శివ, చిన్నమ్మలు నివాసం ఉంటున్న తాటియాకుల పాకలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని సామగ్రి దెబ్బతినడంతో కుటుంబం తీవ్రంగా నష్టపోయింది.
విషయం తెలుసుకున్న వైసీపీ యువ నేత కంటే వినయ్ తేజ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా కంటే వినయ్ తేజ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న కుటుంబాలకు తన వంతు సహాయం అందిస్తానని తెలిపారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహకారం అందించేందుకు ముందుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణ, పెదనగల ప్రకాశం, ఇంటి బ్రదర్, అల్లాడి సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు.