జనసేన కార్యకర్త కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
పామూరు
పామూరు: మండలంలోని తూర్పుకట్ట కిందపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త స్వర్గీయ పాడే రామాంజనేయులు కుటుంబానికి జనసేన నాయకులు ఆర్థిక సహాయం అందించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తితో పార్టీ సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యుడు మాదాసు రమేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మొత్తం రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈ సందర్భంగా మాదాసు రమేష్ మాట్లాడుతూ రామాంజనేయులు కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కుటుంబానికి అవసరమైన సహకారం అందించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుంటారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.