ఊరుమడ్లలో పేద కుటుంబాలకు ఆర్థిక సాయం
చిట్యాల: ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. చిట్యాల మండలం ఊరుమడ్ల గ్రామానికి చెందిన వరికుప్పల రాము, జనపాల లింగస్వామి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించిన ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు.
ఇరు కుటుంబాలకు చెరో రూ.25 వేల చొప్పున మొత్తం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మేకల శ్రీహరి కుమార్తె, రాసమళ్ల సత్యనారాయణ కుమార్తెకు చెరో రూ.25 వేల చొప్పున మరో రూ.50 వేల సాయం అందించారు.
కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలకు, ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు అమిత్ రెడ్డి అండగా నిలిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్థిక సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాగర్ల భానుశ్రీ భిక్షం, ఉప సర్పంచ్ ఉయ్యాల నరేష్, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, సోషల్ మీడియా ఇన్‌చార్జి పట్ల జనార్దన్, వార్డు సభ్యులు గంగాపురం రాము, మేడబోయిన స్వాతి శ్రీను, మర్రి పూలమ్మ శంకర్, జనపాల శ్రీను, ఎలిమినేటి హరిప్రసాద్ రెడ్డి, పాకాల దినేష్, మర్రి రమేష్, రూపని యాదయ్య, సాగర్ల వెంకన్న, మందుగుల జయవర్ధన్, రూపని శ్రీశైలం, రూపని లక్ష్మయ్య, కురుపాం యాదయ్య, జనపాల నర్సింహా తదితర స్థానిక నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.