BREAKING
thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు thumb ● శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో చిన్నారుల యోగా, నృత్య ప్రదర్శనలు thumb ● ఏకగ్రీవ పంచాయతీలకు గరిష్టంగా రూ.50 లక్షల ప్రోత్సాహకం thumb ● మైనారిటీల స్వయం ఉపాధికి ఊతమిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు thumb ● నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు భారీగా తరలిరావాలి thumb ● స్వయం పరిపాలనతో విద్యార్థినుల్లో నాయకత్వ వికాసం thumb ● విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు.. thumb ● మత్స్యగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం thumb ● గ్రామసభల్లో బాలల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించాలి thumb ● ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి thumb ● రెండు నెలలుగా మ్యాథ్స్ బోధనకు దూరమైన విద్యార్థులు
Test 4
Date of Publish : 13 November 2026, 09:37 am
Posted by : BUDDANA VEDA NAYAKA DAYANIDHI

విద్యుత్ వైర్లు కలిసిపోవడంతో అగ్నిప్రమాదం.. ఎనిమిది వ్యవసాయ మోటార్లు దగ్ధం

ఆంధ్రప్రదేశ్
/ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
13 Nov, 2026 - 09:37 AM
23 వీక్షణలు

వాడపల్లి లంక భూముల్లో ఘటన.. వ్యవసాయ పాక, మోటారును కోల్పోయిన సాధనాల సత్యనారాయణ

వాడపల్లి: విద్యుత్ వైర్లు ఒకదానికొకటి తగలడంతో చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ రైతుకు చెందిన వ్యవసాయ పాక, మోటారుతో పాటు మరో ఏడుగురు రైతులకు చెందిన వ్యవసాయ మోటార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో బాధిత రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. వాడపల్లి గ్రామానికి చెందిన లంక భూముల్లో పేరవరం, చెప్పెల గ్రామాలకు విద్యుత్ సరఫరా చేసే వైర్లు ఒకదానికొకటి కలిసిపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సాధనాల సత్యనారాయణకు చెందిన వ్యవసాయ పాక, మోటారు పూర్తిగా దగ్ధమైనట్లు రైతులు తెలిపారు. వీటితో పాటు మరో ఏడుగురు రైతులకు చెందిన ఏడు వ్యవసాయ మోటార్లు కూడా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా ఎనిమిది వ్యవసాయ మోటార్లు దగ్ధమయ్యాయి.

ఇప్పటికే తుపాన్ల ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఈ ఘటన మరో దెబ్బగా మారింది. పంట పొలాలకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసుకున్న మోటార్లు కాలిపోవడంతో నీటిని ఎలా అందించాలో తెలియక అయోమయంలో ఉన్నామని బాధిత రైతులు వాపోతున్నారు. మోటార్ల మరమ్మతులు లేదా కొత్తవి కొనుగోలు చేయడం తమకు అదనపు ఆర్థిక భారంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని బాధిత రైతులు కోరుతున్నారు. ప్రమాదానికి కారణమైన దెబ్బతిన్న విద్యుత్ వైర్లను పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ ప్రమాదం కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.