రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీలకు ఐదుగురు విద్యార్థుల ఎంపిక
ఆంధ్రప్రదేశ్
/
ప్రకాశం
కందుకూరు: కందుకూరు పట్టణంలోని షాదీఖానాలో ఈ నెల 1న నిర్వహించిన జిల్లా స్థాయి టైక్వాండో పోటీల్లో ప్రతిభ కనబరిచిన బి.ఆర్. ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 12, 13 తేదీల్లో అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సజిఫ్ టైక్వాండో పోటీల్లో పాల్గొనేందుకు వారు అర్హత సాధించారు.
అండర్-19 విభాగంలో పి. అతుల్య సాత్విక్ (యూ-63), అండర్-17 విభాగంలో జి. జష్వ (యూ-70), డి. త్రినాథ్ (యూ-45), అండర్-14 విభాగంలో అగస్త్య సాకేత్ (యూ-32), పి. అగస్త్య సార్ధక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను బి.ఆర్. ఆక్స్‌ఫర్డ్ విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కరరావు, కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు జి. బాల భాస్కరరావు, బి. నరేంద్రబాబు, టైక్వాండో ప్రకాశం జిల్లా సెక్రటరీ అబ్దుల్ సలాం, పాఠశాల డీన్, ప్రిన్సిపాల్స్ అభినందించారు.
విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. క్రీడలతో పాటు చదువులోనూ విద్యార్థులు రాణించేలా ప్రోత్సహించాలని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.