BREAKING
thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన బొడ్డేడ ప్రసాద్ thumb అనకాపల్లి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు thumb అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పాఠశాలలకు సెలవు thumb చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ thumb 72 అడుగుల డూండి గణేశుని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్ thumb కర్నూలు జిల్లా తుంగభద్ర నదికి భారీగా నీటి ప్రవాహం...! thumb తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం thumb జిల్లా స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
Date of Publish : 23 September 2026, 07:23 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఐదేళ్ల పదవీకాలం పూర్తి.. గంపలగూడెం ఎంపీపీ పాలకవర్గానికి ఘన వీడ్కోలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Sep, 2026 - 07:23 PM
57 వీక్షణలు

గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండల పరిషత్ పాలకవర్గం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో అభినందన, వీడ్కోలు సభ నిర్వహించారు. ఎంపీడీవో టి. సరస్వతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోగులమూడి శ్రీలక్ష్మి మాట్లాడుతూ మండల పరిషత్ నిధుల నుంచి రూ.5 కోట్లకు పైగా నిధులను వివిధ ప్రజా అవసరాలు, అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించినట్లు తెలిపారు. మండలంలోని ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పాలకవర్గం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.

జడ్పీటీసీ కే. శామ్యూల్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ నుంచి రావాల్సిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ సుమారు రూ.1.25 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు మాట్లాడుతూ ఐదేళ్లపాటు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ పెద్దలు, గ్రామస్థాయి నాయకులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గం పదవీకాలంలో సహకరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు గోగులమూడి చెన్నకేశవరెడ్డి, చెరుకు నరసారెడ్డి, చావా వెంకటేశ్వరరావు, మందపాటి ఉమామహేశ్వర్‌రెడ్డి, కొత్తగుండ్ల వంశీకృష్ణ, బజ్జూరి చంద్రశేఖర్, గౌరసాని శ్రీనివాస్‌రెడ్డి, కామసాని శంకర్‌రెడ్డితో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.