BREAKING
thumb ● జాతీయ ఏకతా దివస్ వేడుకలకు జిల్లా నుంచి 30 మంది ప్రయాణం thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● జాతీయ ఏకతా దివస్ వేడుకలకు జిల్లా నుంచి 30 మంది ప్రయాణం thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌..
మంచి మాట
Date of Publish : 30 October 2026, 05:50 pm
Posted by : SEETHA KIRAN KUMAR

భూటాన్ నుంచి పోటెత్తిన వరద.. భారత్‌లో వేలాది మందికి ముప్పు

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
30 Oct, 2026 - 05:50 PM
10 వీక్షణలు

74 లక్షల క్యూబిక్ మీటర్ల నీటి విడుదల.. పశ్చిమ బెంగాల్, అస్సాంలో హెచ్చరికలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

భూటాన్‌లోని సింటాఫు సరస్సు నుంచి భారీగా వరద నీరు విడుదల కావడంతో భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలకు ముప్పు పొంచి ఉంది. సరస్సు నుంచి సుమారు 74 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని ఒక్కసారిగా విడుదల చేయడంతో దిగువ ప్రాంతాల్లో వరద ప్రభావం పెరిగే ప్రమాదం ఏర్పడింది. మో చు నది మీదుగా సంకోష్ నదిలోకి భారీగా నీరు చేరే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

వరద ముప్పు నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్, కూచ్‌బిహార్ జిల్లాలతో పాటు అస్సాంలోని ధుబ్రీ ప్రాంతాలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అలీపుర్‌దువార్ జిల్లాలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి 10 వేల మందికి పైగా ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. భూటాన్‌లోనూ ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన సహాయక చర్యలకు సిద్ధమవుతున్నారు.

వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున నదుల సమీపంలోకి వెళ్లవద్దని, అధికారుల సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.