BREAKING
thumb ● జాతీయ ఏకతా దివస్ వేడుకలకు జిల్లా నుంచి 30 మంది ప్రయాణం thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌.. thumb ● జాతీయ ఏకతా దివస్ వేడుకలకు జిల్లా నుంచి 30 మంది ప్రయాణం thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● అంజూరు ఎంపీటీసీ పరిధి అభివృద్ధే జనసేన అజెండా thumb ● పెదకూరపాడు నియోజకవర్గ అచ్చంపేటలో టీడీపీ క్లీన్ స్వీప్‌..
మంచి మాట
Date of Publish : 30 October 2026, 05:52 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ఊరి అభివృద్ధి కోసం 310 కి.మీ. సైకిల్ యాత్ర

తెలంగాణ
/ ఆదిలాబాద్ / అదిలాబాద్ రూరల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
30 Oct, 2026 - 05:52 PM
11 వీక్షణలు

ఐదో రోజు హైదరాబాద్‌కు చేరుకున్న గుండి గ్రామ యువకులు

హైదరాబాద్, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

తమ గ్రామ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అభివృద్ధి పనులు సాధించాలనే లక్ష్యంతో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గుండి గ్రామానికి చెందిన యువకులు చేపట్టిన 310 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ఐదో రోజుకు చేరుకుంది. ఈ యాత్రలో భాగంగా యువకులు హైదరాబాద్‌కు చేరుకున్నారు.

గుండి గ్రామంలోని వాగుపై వంతెన నిర్మాణం కోసం సుమారు 20 ఏళ్ల క్రితమే పిల్లర్లు నిర్మించినప్పటికీ, ఇప్పటివరకు పనులు పూర్తికాలేదని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

వర్షాకాలంలో వాగు దాటడం కష్టంగా మారుతోందని, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న వంతెన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి గ్రామ ప్రజల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

గ్రామ అభివృద్ధి కోసం 310 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టిన యువకులు తమ సమస్యలను సంబంధిత ప్రభుత్వ పెద్దలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు గ్రామంలోని ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.