BREAKING
thumb ● వైసీపీలో చేరిన టీడీపీ, బీజేపీకి చెందిన 40 కుటుంబాలు thumb ● బయ్యారంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ thumb ● జాతీయ ఏకతా దివస్ వేడుకలకు జిల్లా నుంచి 30 మంది ప్రయాణం thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు.. thumb ● వైసీపీలో చేరిన టీడీపీ, బీజేపీకి చెందిన 40 కుటుంబాలు thumb ● బయ్యారంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ thumb ● జాతీయ ఏకతా దివస్ వేడుకలకు జిల్లా నుంచి 30 మంది ప్రయాణం thumb ● ఉదయ సముద్రం కాల్వ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి thumb ● ఆలేరులో నవంబర్ 1, 9 తేదీల్లో విప్లవ నేతల వర్ధంతి సభలు thumb ● నాగార్జునసాగర్ పర్యాటక రంగంపై ఎల్‌నినో ప్రభావం thumb ● RR-30 రహదారి దెబ్బతిన్న ప్రాంతాల పరిశీలన thumb ● మునుగోడు ప్రజలకు శుభవార్త.. మరోసారి ఉచిత కంటి వైద్య శిబిరం thumb ● చౌడేపల్లిలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం thumb ● మునగపాక పల్లపు వీధిలో వీధి దీపాలు కరువు..
మంచి మాట
Date of Publish : 30 October 2026, 05:56 pm
Posted by : SEETHA KIRAN KUMAR

డ్రగ్స్‌పై వరంగల్ పోలీసుల మెరుపు దాడులు

తెలంగాణ
/ వరంగల్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
30 Oct, 2026 - 05:56 PM
16 వీక్షణలు
  • 107 మందికి పరీక్షలు.. 29 మందికి పాజిటివ్‌

వరంగల్, అక్టోబర్ 30 (ఎన్ టుడే న్యూస్):

వరంగల్ నగరంలో డ్రగ్స్ వినియోగం, అక్రమ కార్యకలాపాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆటోనగర్, కరీమాబాద్, కాశిబుగ్గ, శంభునిపేట, శివనగర్, ఎల్.బి.నగర్ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో భాగంగా రౌడీషీటర్లు, పాత నేరస్థులు, గతంలో డ్రగ్స్ కేసులతో సంబంధం ఉన్నవారు, అనుమానితులు కలిపి మొత్తం 107 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 29 మందికి పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

అదేవిధంగా సరైన ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 17 ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు, మూడు ఎలక్ట్రిక్ మోటార్ పంపులను స్వాధీనం చేసుకున్నారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో పిటా చట్టం కింద ఒక కేసు నమోదు చేశారు.

డ్రగ్స్ సరఫరా, విక్రయాలు, అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత హెచ్చరించారు. డ్రగ్స్ వ్యసనానికి గురైన వారికి చికిత్స, కౌన్సెలింగ్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా స్థానికులతో మాట్లాడిన పోలీసులు, కాలనీల్లో భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిసినవారు డయల్ 100 లేదా 112కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.

నగరంలో డ్రగ్స్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు వెల్లడించారు.