BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 24 November 2026, 06:42 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో టీడీపీలోకి మాజీ వైసీపీ కౌన్సిలర్ సలామత్, ఏ. రాజు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Nov, 2026 - 06:42 AM
9 వీక్షణలు

అనుచరులు, భారీ సంఖ్యలో యువతతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిక

అన్నమయ్య జిల్లా, పుంగనూరు:

పుంగనూరు పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ సలామత్, పట్టణానికి చెందిన ఏ. రాజు (అఫీషియల్ రాజు) తమ అనుచరులు, భారీ సంఖ్యలో యువతతో కలిసి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

టీడీపీ నాయకత్వంపై నమ్మకంతో, పుంగనూరు పట్టణ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీలో చేరినట్లు సలామత్, ఏ. రాజు తెలిపారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ మధుసూదన్ నాయుడు నాయకత్వంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ కౌన్సిలర్‌తో పాటు యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరడం పట్టణంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూర్చిందని తెలిపారు.

రాబోయే రోజుల్లో పుంగనూరు పట్టణానికి చెందిన మరికొందరు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ చేరికలు పట్టణంలో పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని నాయకులు తెలిపారు.

టీడీపీ కార్యాలయం, పుంగనూరు.