BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 24 November 2026, 06:47 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరులో మురుగునీటితో ప్రధాన రహదారి దుర్గంధభరితం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Nov, 2026 - 06:47 AM
8 వీక్షణలు

మినీ బైపాస్‌లోని కలాం సర్కిల్ వద్ద మురుగు నీటిని రోడ్డుపైకి వదులుతున్నారని స్థానికుల ఆగ్రహం

అన్నమయ్య జిల్లా, పుంగనూరు:

పుంగనూరు పట్టణంలోని మినీ బైపాస్ రహదారి, కలాం సర్కిల్ సమీపంలో మురుగునీటి సమస్యతో స్థానికులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది కాలువలోని మురుగునీటిని మోటార్ల ద్వారా పంపింగ్ చేసి, ప్రజలు, వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపైకి వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో రహదారిపై మురుగునీరు ప్రవహిస్తూ పరిసర ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హోటళ్లు, దుకాణాల వద్దకు చేరుతున్న మురుగునీరు

రోడ్డుకు ఇరువైపులా ఉన్న హోటళ్లు, దుకాణాల ముందు మురుగునీరు ప్రవహిస్తుండటంతో వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. దుర్వాసన కారణంగా హోటళ్లకు వచ్చే వినియోగదారులు లోపలికి రావడానికి వెనుకాడుతున్నారని తెలిపారు.

మరోవైపు రహదారిపై వెళ్లే వాహనాల చక్రాల కింద మురుగునీరు పడి చుట్టుపక్కల ఉన్న హోటళ్లు, దుకాణాలపైకి చిమ్ముతోందని స్థానికులు పేర్కొంటున్నారు. దీనివల్ల ఆహార పదార్థాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్ అధికారులు స్పందించాలని విజ్ఞప్తి

ప్రజలు, వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. మురుగునీటిని రహదారిపైకి వదలకుండా పైపుల ద్వారా ప్రధాన డ్రైనేజీలోకి మళ్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి, దుర్వాసనతో పాటు పారిశుద్ధ్య సమస్య నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతున్నారు.