BREAKING
thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం thumb ● అభివృద్ధి బాటలో కొత్తపేట పంచాయతీ thumb ● చంద్రయ్యపల్లెలో నలుగురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ thumb ● కొబ్బరి సాగుతో రైతులకు అదనపు ఆదాయం thumb ● ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ బావుల పూడికతీత పనులు చేపట్టాలి thumb ● ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకునేలా మామిడి తోటల నిర్వహణ చేపట్టాలి thumb ● 13వ వార్డు సమస్యలపై కలెక్టరేట్‌లో ఫిర్యాదు thumb ● కేటీఆర్ దమ్ముంటే వరంగల్ పశ్చిమలో పోటీ చేయాలి: ఎమ్మెల్యే నాయిని సవాల్ thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న కళాకారుడు రాగిపని శ్రీహరికి ప్రజాసంఘాల ఆర్థిక చేయూత thumb ● బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతరకు సర్వం సిద్ధం thumb ● నెల్లికుదురు మండలంలో ‘తొలిముద్ద’ అల్పాహార పథకం ప్రారంభం
Test 4
Date of Publish : 24 November 2026, 06:34 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పుంగనూరు 5వ వార్డు కౌన్సిలర్‌గా షేక్ యూసుఫ్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Nov, 2026 - 06:34 AM
8 వీక్షణలు

14 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం.. ప్రజాసేవలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం

అన్నమయ్య జిల్లా, పుంగనూరు:

పుంగనూరు మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) నాయకుడు షేక్ యూసుఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన భారత రాజ్యాంగంపై విశ్వాసంతో, ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలందిస్తానని ప్రమాణం చేశారు.

ఈ సందర్భంగా షేక్ యూసుఫ్ మాట్లాడుతూ.. కౌన్సిలర్ పదవి కేవలం హోదా మాత్రమే కాదని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ప్రతీకగా భావిస్తున్నానని తెలిపారు. ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా 5వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, వార్డులోని ప్రజలందరికీ సమానంగా సేవలందిస్తానని పేర్కొన్నారు.

14 ఏళ్లుగా ప్రజా సేవలో యూసుఫ్

ఈ సందర్భంగా SDPI పుంగనూరు అసెంబ్లీ అధ్యక్షుడు దాఫెదార్ సిద్దిక్ మాట్లాడుతూ.. ప్రజల ఆశయాలను నెరవేర్చే లక్ష్యంతో షేక్ యూసుఫ్ ప్రజాసేవలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని అన్నారు. గత 14 సంవత్సరాలుగా ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు.

కరోనా సమయంలో, వరదల సమయంలో, అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి వైద్య సహాయం, అంబులెన్స్ సేవలు, అన్నదానం వంటి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారని గుర్తుచేశారు. ప్రజల అవసరాలకు స్పందిస్తూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని పేర్కొన్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు

ఈ విజయానికి సహకరించిన SDPI నాయకులు, కార్యకర్తలు, 5వ వార్డు ప్రజలు, తన తల్లి ఆశీస్సులకు షేక్ యూసుఫ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో SDPI పుంగనూరు అసెంబ్లీ కమిటీ నాయకులు, టౌన్ కమిటీ నాయకులు, వార్డు కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

— దాఫెదార్ సిద్దిక్, SDPI పుంగనూరు అసెంబ్లీ అధ్యక్షుడు