కైసర్ నగర్‌లో రూ.1.20 కోట్లతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
హైదరాబాద్: గాజులరామారం డివిజన్ పరిధిలోని కైసర్ నగర్‌లో రూ.1.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులు, స్థానికులతో ఆయన చర్చించారు.
ఈ సందర్భంగా కేపీ వివేకానంద్ మాట్లాడుతూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. గతంలో కైసర్ నగర్‌లో భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
రానున్న రోజుల్లో కైసర్ నగర్‌లో అవసరమైన మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు.
అనంతరం సాయిబాబా నగర్, మంజూరు నగర్, సాబేర్ నగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి కాలనీల్లో అందుతున్న మౌలిక వసతులు, పరిష్కరించాల్సిన సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కైసర్ నగర్‌లో జరిగిన కార్యక్రమంలో కాలనీ వాసులు అజయ్ గుప్తా, మసూద్, మామి, నయీముద్దీన్, ఆసిఫ్, శ్రీనివాస్ యాదవ్, ఈశ్వర్ యాదవ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సాయిబాబా నగర్‌లో నిర్వహించిన పాదయాత్రలో సాయిబాబా, బాలరాజు, గంగాధర్, శ్రీనివాస్ గౌడ్, రాము, లక్ష్మీ, ఝాన్సీ, అంజనమ్మ, రాజా, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సాబేర్ నగర్‌లో నిర్వహించిన పాదయాత్రలో కుర్షీదా ఆపా, ఇబ్రహీం ఖాన్, ఉదయ్ భావన్, మహమ్మద్ ఖాన్, వినోద్, కరీముద్దీన్, ఎండీ అసన్, పింకీ, రవి, కుర్మయ్య, ఉస్మాన్, యూసుఫ్, ఆసిఫ్, బిందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఈ కల్యాణ్, వాటర్ వర్క్స్ మేనేజర్ అనూష, విద్యుత్ ఏఈ భార్గవ్, పాక్స్ డైరెక్టర్ పరుశ శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, తెలంగాణ సాయి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.