తడికలపూడిలో రూ.2.85 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా రూ.2.85 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ శంకుస్థాపన చేశారు.
వీబీగ్రామ్జీ నిధులతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రామంలోని అంతర్గత రహదారులను అభివృద్ధి చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల మండల అధ్యక్షులు, సొసైటీ చైర్మన్, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.