UIDAI ఆధార్ అప్డేట్‌కు ఉచిత శిబిరాలు
జాతీయం
ఆధార్ వివరాలను పదేళ్లకోసారి అప్డేట్ చేసుకోవాలని UIDAI సూచించిన నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉచిత ఆధార్ అప్డేట్ శిబిరాలను నిర్వహిస్తోంది. నేటి నుంచి అక్టోబర్ 20 వరకు విద్యార్థులు తమ ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.
5 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సున్న విద్యార్థుల్లో చాలామంది ఇప్పటివరకు అవసరమైన ఆధార్ అప్డేట్ చేసుకోకపోవడంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. విద్యార్థులకు సులభంగా సేవలు అందించేందుకు పాఠశాలల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ ఉచితంగా ఆధార్ అప్డేట్ సేవలు అందుబాటులో ఉంచుతున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ వివరాలను పరిశీలించి, అవసరమైన అప్డేట్‌లను అక్టోబర్ 20లోగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.