BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 29 September 2026, 02:52 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

గ్రామీణ యువతకు ఉచిత కంప్యూటర్, నైపుణ్య శిక్షణ

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
29 Sep, 2026 - 02:52 PM
17 వీక్షణలు

ఒంగోలు: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న గ్రామీణ ప్రాంత యువతకు మూడు నెలల ఉచిత కంప్యూటర్, స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ అందించనున్నట్లు డీపీ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

10వ తరగతి లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి, 18 సంవత్సరాలు పైబడిన యువత ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

శిక్షణలో కంప్యూటర్ నైపుణ్యాలు, స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, ప్రాక్టికల్ ట్రైనింగ్ వంటి అంశాలను బోధించనున్నట్లు వివరించారు. శిక్షణ పూర్తైన అనంతరం ఉద్యోగ అవకాశాల కోసం ప్లేస్‌మెంట్ సపోర్ట్ అందించనున్నట్లు తెలిపారు.

అర్హులైన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్, భోజనం, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

శిక్షణకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 9346029852, 8500141004 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. శిక్షణ కేంద్రం డీపీ ఫౌండేషన్, ఒంగోలులో ఉన్నట్లు పేర్కొన్నారు.