వెల్లంకి గ్రామంలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమం
వెల్లంకి గ్రామంలో పశువుల దూడలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం
దూడల ఆరోగ్యం, ఎదుగుదలకు డీవార్మింగ్ ఎంతో ఉపయోగకరం.. పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్
వెల్లంకి, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పాడి ఆవు దూడలు, గేదె దూడలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని దూడలకు నట్టల నివారణ మందులు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దూడల ఆరోగ్యానికి డీవార్మింగ్ కీలకం
ఈ సందర్భంగా సర్పంచ్ ఈడెం రాధా శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత డీవార్మింగ్ కార్యక్రమం ద్వారా దూడల ఆరోగ్యం, ఎదుగుదల మెరుగుపడతాయని తెలిపారు. పశువుల్లో నట్టల సమస్యలను నివారించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
గ్రామంలోని పాడి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పశువుల దూడలకు నట్టల నివారణ మందులు వేయించాలని పిలుపునిచ్చారు.
పాల్గొన్న పశువైద్య సిబ్బంది, రైతులు
ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ సుభాషిని, గోపాలమిత్ర మల్లేష్, రైతులు చలమల్ల పెంటారెడ్డి, గట్టు బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.