BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 October 2026, 09:38 pm
Posted by : KOLA MAHESH

మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం

తెలంగాణ
/ నల్గొండ / మునుగోడు
Reporter
Kola Mahesh Munugodu Constituency
08 Oct, 2026 - 09:38 PM
13 వీక్షణలు

మునుగోడు: కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాల్లో భాగంగా గురువారం మునుగోడులో వైద్య సమీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో కంటి సమస్యలను గుర్తించిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.

ఈ కార్యక్రమానికి సమీక్ష కోసం హాజరు కావాల్సిన 43 మంది రోగుల్లో 26 మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. గతంలో శస్త్రచికిత్సకు అంగీకరించని లేదా వైద్యపరంగా అనర్హులుగా గుర్తించిన వారిలో 51 మంది కూడా ఈ సమీక్ష శిబిరానికి హాజరయ్యారు.

వైద్యుల పరీక్షల అనంతరం 15 మంది రోగులను శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. మరో 10 మంది రోగులను వైద్యపరంగా శస్త్రచికిత్సకు అనర్హులు (అన్‌ఫిట్)గా గుర్తించారు. అదేవిధంగా 40 మంది రోగులకు జనరల్ ఫిజీషియన్ వైద్య పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా అవసరమైన మందులు, కళ్లద్దాలను అందించారు.

నియోజకవర్గంలోని పేద, అవసరమైన వర్గాలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను అందించడంతో పాటు, చికిత్స అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలు, శస్త్రచికిత్స సదుపాయాలు అందించేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా కంటి సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన చికిత్స అందించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.