BREAKING
thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం
Date of Publish : 02 October 2026, 05:30 pm
Posted by : SEETHA KIRAN KUMAR

వడ్డేపల్లిలో ఉచిత మెగా వైద్య శిబిరం

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
02 Oct, 2026 - 05:30 PM
2 వీక్షణలు

వరంగల్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 58వ డివిజన్ రోజ్ గార్డెన్‌లో వడ్డేపల్లి దళిత సంక్షేమ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఫాదర్ కొలంబో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మెడికర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ప్రారంభించారు.

గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ జయంతిని కేవలం జయంతి కార్యక్రమంగా కాకుండా ప్రజలకు సేవ చేసే రోజుగా నిర్వహించడం అభినందనీయమన్నారు. గాంధీజీ చూపిన శాంతి, అహింస, సేవా మార్గాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

దేశం కోసం మహాత్మా గాంధీతో పాటు ఆయన కుటుంబం చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, పేదలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజానికి మేలు చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజలకు అవసరమైన సమయంలో తమ వంతు సహాయం అందించడమే నిజమైన ప్రజాసేవ అని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వడ్డేపల్లి దళిత సంక్షేమ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లోనూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు సహకారం అందిస్తానని పేర్కొన్నారు.

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సుధాకర్, మాజీ కార్పొరేటర్ నాగరాజు, నాయకులు రవీందర్, మేరీ, దామోదర్, వైద్య సంస్థల డైరెక్టర్లు, వైద్యులు, సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వడ్డేపల్లి దళిత సంక్షేమ గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.