ఉచిత ప్రయాణాలు@ 100 కోట్లు
ఆంధ్రప్రదేశ్
AP: గతేడాది ఆగస్టు 15న ప్రారంభమైన' స్త్రీశక్తి 'పథకానికి విశేష స్పందన వస్తుందని ర్టీసీ వెల్లడించింది.నిన్నటి వరకు మహిళల ఉచిత ప్రయాణాలు సంఖ్య 100 కోట్ల మైలు రాయిని దాటినట్లు తెలిపింది. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఫ్రీగా జర్నీ చేస్తున్నట్లు చెప్పింది. ఇప్పటి వరకు వారికి ₹ 3,550 కోట్లు మేరా హార్దిక ప్రయోజనం లభించిందని పేర్కొంది. ఆర్టీసీ పై నెలకు ₹ 160 కోట్ల భారం పడుతుండగా, ప్రభుత్వం ₹ 2,160 కోట్లు చెల్లించినట్లు వివరించింది.