BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 07:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాయచోటి డైట్‌లో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Nov, 2026 - 07:06 AM
31 వీక్షణలు

నూతన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం.. 

సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి లక్ష్యసాధనకు నిరంతర సాధన, కృషి అవసరం: డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ రాయచోటి: జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో ప్రథమ సంవత్సరం ఛాత్రోపాధ్యాయులకు స్వాగతం పలుకుతూ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగాయి. నూతన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ నిర్వహించిన ఈ వేడుకలు కళాశాల ప్రాంగణంలో సందడి నింపాయి. విద్యార్థుల మధ్య స్నేహభావం, పరస్పర సహకారం, ఐక్యతను పెంపొందించడంతో పాటు కొత్తగా విద్యా ప్రయాణం ప్రారంభించిన విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏకపాత్రాభినయాలు, నృత్యాలు, నాటకాలతో విద్యార్థులు తమలోని కళాత్మక ప్రతిభను చాటుకున్నారు. ఉత్సాహభరితమైన ప్రదర్శనలతో తోటి విద్యార్థులను అలరించారు. వేడుకలతో డైట్ ప్రాంగణం సందడిగా మారింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. లక్ష్యాన్ని చేరుకోవాలంటే క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెడుతున్న విద్యార్థులు విద్యతో పాటు విలువలు, బాధ్యతాయుతమైన ప్రవర్తనను అలవర్చుకోవాలని హితవు పలికారు. ఫ్రెషర్స్ డే వంటి వేడుకలు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డైట్ అధ్యాపకులు, ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు.