స్నేహమే బలం.. మిత్రుడికి స్వయం ఉపాధి కల్పించిన స్నేహితులు
NTODAY NEWS: చిట్యాల :
చిన్ననాటి స్నేహానికి వయసుతో సంబంధం లేదని పెద్దకాపర్తి గ్రామానికి చెందిన 2002–2003 టెన్త్ క్లాస్ మిత్రబృందం నిరూపించింది. చదువుకునే రోజుల్లో కలిసి మెలిసి తిరిగిన బాల్య మిత్రులు రెండు దశాబ్దాలు గడిచినా తమ స్నేహబంధాన్ని కొనసాగిస్తూ కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు.
తమ మిత్రుడు బత్తుల శ్రీకాంత్‌కు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2002–2003 టెన్త్ క్లాస్ మిత్రబృందం సుమారు రూ.35 వేల ఆర్థిక సహకారం అందించి స్వీట్ అండ్ మిక్చర్ బండి వ్యాపారాన్ని ప్రారంభింపజేసింది. ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక వ్యాపార బండి మాత్రమే కాదని, తమ స్నేహానికి గుర్తుగా, ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుందని తెలిపారు. కష్టకాలంలో మిత్రుడికి అండగా నిలిచి, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకాంత్ ప్రారంభించిన వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, ఆయన ఆర్థికంగా స్థిరపడాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు నీలకంఠం లింగస్వామి, సాగర్ల నాగరాజు, గుండెపురి లింగస్వామి, చేకూరి గణేష్, గుత్తా కుశల్ కుమార్ రెడ్డి, ఎడ్ల రాములు, ఏర్పుల పరమేష్, గుండెపురి శేఖర్, గుండెపురి కృష్ణతో పాటు పలువురు మిత్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు