BREAKING
thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే thumb ● చింతూరు డివిజన్‌లో కౌంటింగ్ సిబ్బందికి శిక్షణకు హాజరైన కలెక్టర్ thumb ● చండూరు: మిత్రుడి తల్లి మృతికి స్నేహితుల ఆర్థిక సాయం thumb ● బోర్‌వెల్ డ్రిల్లింగ్ యంత్రం తగిలి కార్మికుడు మృతి thumb ● తొట్టంబేడు, రేణిగుంట జెడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల విజయం thumb ● వెలవర్తిపాడు ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం thumb ● దీపావళి వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలి-ఎస్‌ఐ సీత పాండు thumb ● జంగంగుంట్లపాలెం ఎంపీటీసీ స్థానంలో వైసీపీ విజయం thumb ● పల్లె వెంకన్న కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి thumb ● కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు thumb ● మునుగోడు, దేవరకొండ రైతులకు సాగునీటి కోసం ఎదురుచూపులే
Test 4
Date of Publish : 07 November 2026, 09:34 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు పట్టణ అభివృద్ధికి సంపూర్ణ ప్రాధాన్యత..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Nov, 2026 - 09:34 AM
20 వీక్షణలు

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా ప్రజల తీర్పును శిరసావహిస్తున్నా

చైర్మన్ పదవిని అధికారంగా కాకుండా బాధ్యతగా భావిస్తా తనను గెలిపించిన పట్టణ ప్రజలకు జనసేన పార్టీ మున్సిపల్ చైర్మన్ పసుపులేటి మాధవి కృతజ్ఞతలు ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన పసుపులేటి మాధవి పట్టణ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఓటు వేసి అత్యంత ఆదరణతో గెలిపించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా శిరసావహించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయం తన ఒక్కరిదే కాదని, తనపై విశ్వాసం ఉంచిన తిరువూరు పట్టణ ప్రజలందరిదని పేర్కొన్నారు. ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, ఆశీర్వాదం తనకు ఎప్పటికీ మరువలేని అనుభూతినిచ్చాయని తెలిపారు. ఎన్నికల సమయంలో తనకు అండగా నిలిచి విజయానికి కృషి చేసిన కూటమి నాయకులు, జనసేన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలు తనకు అప్పగించిన మున్సిపల్ చైర్మన్ పదవిని అధికారంగా కాకుండా ఎంతో విలువైన బాధ్యతగా భావిస్తానని స్పష్టం చేశారు. ఓటు వేసిన వారితో పాటు ఓటు వేయని వారిని కూడా సమానంగా గౌరవిస్తూ, రాజకీయాలకు అతీతంగా పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. తిరువూరు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి సమస్య పరిష్కారం, పారిశుధ్య నిర్వహణ, మెరుగైన రహదారుల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డును సమానంగా అభివృద్ధి చేస్తూ, ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతానని వెల్లడించారు. పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తిరువూరు పట్టణ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని పసుపులేటి మాధవి నరేష్ మిత్ర (పండు) స్పష్టం చేశారు.