BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 29 September 2026, 05:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

దుందిరాలపాడు ప్రాథమిక పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్‌గా గంధం రామకృష్ణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Sep, 2026 - 05:15 PM
3 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం పేరెంట్స్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా నిర్వహించిన ఈ ఎన్నికల్లో కమిటీ చైర్మన్‌గా గంధం రామకృష్ణ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా నోముల మరియమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో తల్లిదండ్రులు పాల్గొని కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 12 మంది కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం, పాఠశాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, విద్యా వాతావరణాన్ని మరింత మెరుగుపరచడం వంటి అంశాలపై కమిటీ సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.

పాఠశాల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని, విద్యార్థుల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు.

ఎన్నికైన పేరెంట్స్ కమిటీ చైర్మన్ గంధం రామకృష్ణ, వైస్ చైర్మన్ నోముల మరియమ్మతో పాటు 12 మంది కమిటీ సభ్యులను గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది అభినందించారు.