BREAKING
thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● వావిళ్లపల్లిలో కాంగ్రెస్ గ్రామ శాఖకు నూతన అధ్యక్షుడు thumb ● పట్టబద్రుల ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి ఒక్కరు ముందుకు రావాలి thumb ● ఘనంగా మహాత్మా గాంధీజీ 157 వ జయంతి వేడుకలు thumb ● పల్నాడు జిల్లాలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● బీరంగూడలో హంపి షాపింగ్ మాల్ ప్రారంభం thumb ● చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు thumb ● గాంధీ జయంతి వేడుకల్లో పరిశుభ్రతపై అవగాహన: పేరవాండ్లపల్లిలో ఘనంగా గ్రామసభ thumb ● అశోకా గ్రూప్ రుణ వాయిదాల వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి thumb ● వైసీపీ నుంచి 80 కుటుంబాలు టీడీపీలో చేరిక
Date of Publish : 02 October 2026, 02:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెనుగొలనులో గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Oct, 2026 - 02:21 PM
33 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని 99వ అంగన్వాడీ కేంద్రం వద్ద శుక్రవారం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు కే. లింగమ్మ మాట్లాడుతూ సత్యం, అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ పాలనను ఎదుర్కొన్న మహాత్మా గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గం నేటికీ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం, స్వచ్ఛభారత్ లక్ష్యాలను సాకారం చేయడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు.

శిరిడి సాయిబాబా యువజన సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ మాట్లాడుతూ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన “జై జవాన్‌ – జై కిసాన్‌” నినాదం సైనికుల ధైర్యాన్ని, రైతుల శ్రమను దేశ ప్రగతికి కీలకమైన శక్తులుగా చాటిచెప్పిందని కొనియాడారు. నిజాయితీ, నిరాడంబరత, కర్తవ్యనిష్ఠ, దేశభక్తికి ప్రతిరూపంగా నిలిచిన వారి జీవితం నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.

అనంతరం చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.