వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో గాంధీ జయంతి వేడుకలు
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
వరంగల్: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో గాంధీ చిత్రపటానికి పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎన్. శ్వేత మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించి సమాజంలో శాంతి, సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖ నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. ప్రజలతో సత్సంబంధాలను కొనసాగిస్తూ విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, అడిషనల్ డీసీపీ (అడ్మినిస్ట్రేషన్) రాయల ప్రభాకర్ రావు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఏఆర్, సివిల్ పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.