నేరళ్లపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
నేరళ్లపల్లి: గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సమీనా జమీర్ పాషా, పంచాయతీ కార్యదర్శి నరేందర్ రెడ్డి, డిప్యూటీ సర్పంచ్ గంగాపురం సత్యనారాయణతో పాటు వార్డు సభ్యులు మల్లేష్, వేణుకుమార్, అరుణ హర్షవర్ధన్ తదితరులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజలంతా ఐక్యంగా పనిచేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు.
గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని సూచించారు.