BREAKING
thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● దివీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం, నోట్‌బుక్స్ పంపిణీ thumb ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: thumb ● సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి thumb ● చిట్టతూరులో జనసేన, టీడీపీ నాయకుల ఎన్నికల ప్రచారం thumb ● నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ఉచిత శిక్షణతో పాటు ఉపాధి thumb ● మెరుగు పెద్ద జంగయ్య దశదినకర్మ లో పాల్గొని నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు thumb ● మంచాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి thumb ● మోగనున్న పెళ్లి బాజాలు... నవంబర్ 9 నుంచే ముహూర్తాలు షురూ... thumb ● డాన్ బోస్కో హైస్కూల్‌లో బాలల సైబర్ భద్రతపై న్యాయ అవగాహన సదస్సు thumb ● రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదుల పాత్ర కీలకం thumb ● దివీస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య శిబిరం, నోట్‌బుక్స్ పంపిణీ thumb ● పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి: thumb ● సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి
మంచి మాట
Date of Publish : 28 October 2026, 08:04 pm
Posted by : కూనురు మధు

ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీల ముఠా గుట్టురట్టు.. నలుగురు అరెస్ట్‌!

తెలంగాణ
/ నల్గొండ
28 Oct, 2026 - 08:04 PM
2 వీక్షణలు


తెలుగు రాష్ట్రాల్లో 29 చోరీలు.. రూ.20 లక్షల నగదు, రెండు కార్లు స్వాధీనం


NTODAY NEWS నల్లగొండ:


రైతుల వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని కాపర్‌ వైర్లు, ఆయిల్‌ చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి రూ.20 లక్షల నగదు, సుమారు రూ.30 లక్షల విలువైన రెండు కార్లు, కాపర్‌ వైర్లు, చోరీలకు ఉపయోగించిన పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఈ ముఠా మొత్తం 29 చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కేసులో 100 శాతం రికవరీ సాధించినట్లు జిల్లా ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ వెల్లడించారు.


వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితులు


వేములపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎల్‌-15 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి చెందిన 500 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి 300 కిలోల కాపర్‌, 250 లీటర్ల ఆయిల్‌ చోరీకి గురైన ఘటనపై ఆగస్టు 22న కేసు నమోదైంది. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అక్టోబర్‌ 28న వేములపల్లి గ్రామ శివారులోని సూర్యాపేట క్రాస్‌రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద కారులో ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వారి సమాచారంతో మరో నిందితుడిని కూడా అరెస్టు చేశారు.


నల్లగొండ జిల్లాలోనే 18 కేసులు


నిందితులు రాత్రివేళల్లో గ్రామాలకు దూరంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని కట్టర్లు, ఇతర పనిముట్లతో వాటిని ధ్వంసం చేసి కాపర్‌ వైర్లు, ఆయిల్‌, అల్యూమినియం వైర్లను చోరీ చేసేవారు. వాటిని పాత సామగ్రి వ్యాపారులకు విక్రయించి వచ్చిన డబ్బులను పంచుకునేవారు. పోలీసులకు అనుమానం రాకుండా నకిలీ నంబర్‌ ప్లేట్లను వినియోగించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ముఠా తెలంగాణలో 25, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చోరీలకు పాల్పడగా, నల్లగొండ జిల్లాలోనే 18 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉండటంతో వారి కోసం గాలిస్తున్నారు.


పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు


అరెస్టయిన వారిని షేక్‌ చంద్‌ పాషా, రామావత్‌ సూర్య, గలబ సాయి కిరణ్‌, ఇస్లావత్‌ దేశిరామ్‌గా గుర్తించారు. వీరిలో దేశిరామ్‌ చోరీ సొత్తును కొనుగోలు చేసేవాడిగా పోలీసులు పేర్కొన్నారు. మిర్యాలగూడ డీఎస్పీ జి. రవి పర్యవేక్షణలో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. జితేందర్‌ రెడ్డి, మిర్యాలగూడ టూటౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ జె. సోమనర్సయ్య, రూరల్‌ సీఐ పి.ఎన్‌.డి. ప్రసాద్‌, వేములపల్లి ఎస్‌ఐ వి. సురేశ్‌ రెడ్డి తదితరులు కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించారు. పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు భరోసా కల్పించేందుకు చర్యలు కొనసాగిస్తామని ఎస్పీ తెలిపారు.