మార్కాపురం జిల్లా ఉపాధి అధికారిగా గోన కోటేశ్వరరావు
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
మార్కాపురం: జిల్లా ఉపాధి అధికారి (Employment Officer)గా గోన కోటేశ్వరరావు నియమితులయ్యారు. సోమవారం మార్కాపురం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ విజయ సునీతను కలిశారు.
ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చేపడుతున్న కార్యక్రమాల గురించి కోటేశ్వరరావు వివరించారు.
DDU-GKY 2.0 ద్వారా గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ ద్వారా యువతలో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతకు అందుబాటులో ఉన్న నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోటేశ్వరరావు సూచించారు.