ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది: వేముల వీరేశం
రామన్నపేట, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్):
రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. మంగళవారం రామన్నపేట మండలంలోని సర్నేనిగూడెం, వెల్లంకి, సిరిపురం, బోగారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఈ సందర్భంగా వేముల వీరేశం మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మహిళా సంఘాల బలోపేతానికి కృషి
గ్రామీణ మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఐకేపీ కేంద్రాల ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు, రుణ సదుపాయాలు మరింత చేరువవుతాయని తెలిపారు.
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పున్న జగన్మోహన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తిమ్మాపురం మహేందర్ రెడ్డి, వలిగొండ-రామన్నపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల బిక్షం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల వెంకట్ రాజిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.డి. జమీరుద్దీన్, గుత్తా నర్సిరెడ్డి, వనం చంద్రశేఖర్, ఎం.డి. అక్రమ్, శంబాల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, ఐకేపీ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.