మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్
/
అనకాపల్లి
మునగపాక: మండలంలోని మూలపేట గ్రామంలో శ్రీ గంగాలమ్మ తల్లి పండగను గురువారం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా సెప్టెంబర్‌లో నిర్వహించే ఈ పండగను గ్రామంలో సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు.
అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల రాకపోకలు, దర్శనం, తీర్థప్రసాదాల పంపిణీ తదితర అంశాలపై ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
పండగ సందర్భంగా గురువారం రాత్రి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు.