ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
దండేపల్లిలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
విగ్రహానికి నివాళులర్పించిన కాంగ్రెస్, రజక సంఘం నాయకులు
దండేపల్లి: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను దండేపల్లి మండల కేంద్రంలోని సాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. రజక సంఘం జిల్లా అధ్యక్షుడు కటుకూరి రాజన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, రజక సంఘం ప్రతినిధులు హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజా పోరాట చరిత్రలో కీలక పాత్ర పోషించారని, ఆమె చేసిన త్యాగాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు.
దండేపల్లి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సమయంలో అప్పటి ప్రతిపక్షంలో ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించి అన్నదానం చేశారని, రజకుల సమస్యలకు అండగా నిలిచారని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు గుర్తు చేశారు.
అలాగే కోటి మహిళా ఉమెన్స్ కాలేజీకి సాకలి ఐలమ్మ పేరు పెట్టడం ద్వారా ఆమె సేవలను చిరస్మరణీయంగా నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ ముత్యాల శ్రీనివాస్, ఆర్‌జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బిల్లకూరి శంకరయ్య, రజక సంఘం పట్టణ అధ్యక్షుడు అల్వల సత్యం తదితరులు పాల్గొన్నారు.
సర్పంచులు అజ్మీరా రాజేశ్వర్ నాయక్, చుంచు నాగేష్, చిలుకూరి మహేష్, చొప్పదండి అనూష రాజేష్, కందుల కళ్యాణి అశోక్, లక్కాకుల వనిత సృజన్, గోపి రాయమల్లు, నందిని అశోక్ నాయక్, కొత్తపల్లి కళా చిరంజీవి, మాజీ ఎంపీటీసీ ముథె నారాయణ, మాజీ సర్పంచ్ గాజుల శ్రీనివాస్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ, రజక సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నాయకులు వెంగల్ రావు, బండారి వెంకటేష్, మగ్గిడి మహేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శరత్, ఆకుల తిరుపతి, నర్సాపూర్ రాజేష్, పంచహర్పుల వెంకటేష్, కారణాల మల్లయ్య, మర్రిపల్లి వెంకటేష్, సతీష్, మందపల్లి వెంకటేష్, ముంజంపల్లి సత్తయ్య, కోడపర్తి రాయమల్లు, కుమ్మరి మురళి, కుదురుపాక శ్రీనివాస్, మారాజు సతీష్ తదితరులు పాల్గొన్నారు.